కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గూడెపు సారంగపాణి దరఖాస్తు

కరీంనగర్, అక్టోబరు 15, 2025:
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గూడెపు సారంగపాణి తన దరఖాస్తును ఏఐసీసీ అబ్జర్వర్స్‌కు సమర్పించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్జర్వర్స్‌ను కలిసిన సారంగపాణి, పార్టీ బలోపేతానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని వారికి వివరించారు.
ఈ సందర్భంగా గూడెపు సారంగపాణి మాట్లాడుతూ.. తాను 33 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని తెలిపారు. హుజురాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఎన్ఎస్‌యూఐ విద్యార్థి ప్రెసిడెంట్‌గా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా 23 సంవత్సరాలు పనిచేశానని పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వేలాది పార్టీ కార్యక్రమాలను నిర్వహించానని, తన పూర్తి జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితం చేశానని వెల్లడించారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తనకు జిల్లా నలుమూలల నుంచి, ముఖ్యంగా హుజురాబాద్, జమ్మికుంట నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన తనను అధ్యక్షునిగా నియమించాలని పార్టీ అధిష్టానాన్ని అభ్యర్థించారు.

  • Comments are closed.
  • aditya hospital banner

    Also read:

    Listings News Offers Jobs Videos