ప్రభుత్వ పాఠశాలను ఉన్నతంగా తీర్చి దిద్దాలని విద్యాశాఖ మంత్రిని కోరిన నంది అవార్డు గ్రహీత ప్రభు

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో మంగళ వారం మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చా అందజేసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం , మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల భవనాలు, ప్రహరీ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయని, పాఠశాల భవనాలు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయకపోవడంతో పాఠశాల సమయంలో కాకుండా ఇతర సమయాలలో ప్రజలు కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెంటనే పాఠశాల భవనాలకు ప్రహరి గోడలు వెంటనే నిర్మించారు తీసుకోవాలని కోరారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact