హుజురాబాద్, మార్చి 23: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) హుజురాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా జమ్మికుంటకు చెందిన డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) నియమితులయ్యారు. హుజురాబాద్‌లో జరిగిన సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ ఈ మేరకు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య వసతులు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి కి వినతి పత్రాన్ని అందజేసిన నంది అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ ప్రభు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో తన నివాసంలో మంగళ వారం మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చా అందజేసీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం , మెరుగైన వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అంబాల ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్రంలో […]