జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ జమ్మికుంట — బాలలదినోత్సవం,
స్వయం పాలనా దినోత్సవ కార్యక్రమం

జమ్మికుంట: జెడ్‌పిహెచ్‌ఎస్ గర్ల్స్ జమ్మికుంట పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా స్వయం పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొత్తం 22 మంది విద్యార్థులు చిన్న ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతుల్లో పాఠాలు బోధించి తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో నాయకత్వ గుణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

కార్యక్రమం అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందర్నీ అలరించారు. ఈ సమావేశానికి విచ్చేసిన మండల విద్యా అధికారి హేమలత గారు  ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులను అభినందించి, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని అన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు దమేరా సుదాకర్ గారు మాట్లాడుతూ “దేశ భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లోనే ఉంది, ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మాటలను స్మరించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి విలువలు, బాధ్యతా భావం వృద్ధిచేయడానికి దోహదం చేస్తాయని” పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశాచార్య, వెంకటేశ్వర్లూ, ఇలయ్య, భాగ్యలక్ష్మి, రామకుమారి, శ్రీలత, లక్ష్మీదేవి, లావణ్య, శ్రీనివాస్  పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact