ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ‘వెల్కమ్ పార్టీ’

జమ్మికుంట, అక్టోబర్ 15, 2025:
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులు ‘వెల్కమ్ పార్టీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కరీంనగర్ జిల్లా డివిజనల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DIEO) గంగాధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
విద్యార్థులను ఉద్దేశించి DIEO గంగాధర్ ప్రసంగిస్తూ… విద్యార్థులు మంచిగా చదువుకొని, కళాశాల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచి, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. కష్టపడి చదవడం ద్వారానే ఉన్నత ఫలితాలను సాధించవచ్చని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ విశ్వనాథరెడ్డి, అధ్యాపకులు, టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact