జమ్మికుంట: స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఉత్తరా నక్షత్ర లక్ష్మీ గణపతి హోమం తో పాటు, స్వామివారికి నవవిధ అభిషేకములు, రుద్రాభిషేకం జరిగాయి.
అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేసి, అఖండ హారతి ఇచ్చారు. ఈ విశేషమైన రోజును పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించారు. వారికి బ్రహ్మశ్రీ గొడవర్తి శ్రీనివాస్ శర్మ మాల మంత్రాలతో దీక్షను ధరింపజేశారు. దీక్ష స్వీకరించిన స్వాములందరిపై జమ్మికుంట శ్రీధర్మశాస్త్ర కరుణాకటాక్షాలు ఉండాలని అయ్యప్ప సేవా సమితి కోరింది.







