విషాదం: పురుగుల మందు తాగిన పాఠశాల విద్యార్థులు – విద్యార్థి నాయకుల ఆందోళన!

జమ్మికుంట: స్వామి వివేకానంద పాఠశాల హాస్టల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని అధికారులను కోరినా, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై BRSV రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల యజమాన్యం కనీసం స్పందించకపోవడం, అధికార యంత్రాంగం మద్దతుగా నిలవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలు ధన దాహంతో విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని విస్మరిస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే యజమాన్యం, మండల విద్యాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే BRSV ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact