అక్టోబర్ 14, 2025
జమ్మికుంట:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట ఖండం ఆధ్వర్యంలో పట్టణంలో పదసంచలనం (రూట్ మార్చ్) వైభవంగా జరిగింది.
శ్రీ సరస్వతి శిశు మందిర్ నుంచి పురవీధుల గుండా స్వయంసేవకులు క్రమశిక్షణతో కూడిన కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ దాసరి రవీందర్, ముఖ్య అతిథి డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, ప్రధాన వక్త దేవుని మురళి సహా దాదాపు 200 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టిన ఈ కవాతుకు జమ్మికుంట పట్టణ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు మంగళహారతులు, పువ్వులతో స్వయంసేవకులను అభినందించారు. హిందూ ధర్మ స్థాపనకై పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచ దేశాల ముందుందని అన్నారు.







