జమ్మికుంట: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి.పి.టి.ఎఫ్) సీనియర్ నాయకులు కోల రాజమల్లు ఆధ్వర్యంలో జమ్మికుంట మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను సేకరించారు.
పెండింగ్‌లో ఉన్న ఐదు డి.ఏ.లు, నాణ్యమైన పి.ఆర్.సి.ని వెంటనే ప్రకటించాలని ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జి.పి.ఎఫ్., సరెండర్ లీవ్స్, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకు అంకితం చేసే విధంగా విధానాలు ఉండాలని, పర్యవేక్షణ పేరుతో ఒత్తిడి పెంచవద్దని సూచించారు.
అనంతరం, మండల ప్రధాన కార్యదర్శిగా పాక కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పేరు అవినాష్, జిల్లా కార్యదర్శి కోడిగూటి తిరుపతి, మండల అధ్యక్షులు కొండపాక తిరుపతి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ కవి అందెశ్రీ మరణం తీరని లోటని అవినాష్ పేర్కొన్నారు.







