పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ప్రారంభం

జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ఆవరణలో శ్రీ గోవిందాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి పర్యవేక్షణలో అర్చక బృందం వేదమంత్రాల మధ్య సుప్రభాతం, గోపూజ, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ సహా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చిట్టోజు రజిత శ్రీనివాస్ దంపతులు మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకార రమేష్, జూపాక శ్రీనివాస్, సూరాచారిలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact