జమ్మికుంట: మానవ హక్కుల వేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు జమ్మికుంటలో బాలగోపాల్ 16వ స్మారక సమావేశపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 12వ తేదీ (ఆదివారం) హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు జరగనుంది.
ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ అచ్యుత్ కుమార్ మాట్లాడుతూ, మానవ హక్కుల కోసం బాలగోపాల్ మూడు దశాబ్దాలు కృషి చేశారని కొనియాడారు. ఆర్థిక, సామాజిక, లింగ వివక్ష లేకుండా అందరికీ హక్కులు అందే సమాజం కోసం ఆయన ఆరాటపడ్డారని తెలిపారు.
ఈ సదస్సులో ప్రొఫెసర్ నందిని సుందర్ “బస్తర్ ఎవరిది?”, యోగేంద్ర యాదవ్ “ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థకు సవాళ్లు”, అపార్ గుప్త “కృత్రిమ మేధ కాలంలో వ్యక్తిగత గోప్యత హక్కు”, పి. ఎస్ అజయ్ కుమార్ “కొత్త తరహా భూ దొంగతనాలు” వంటి కీలక అంశాలపై మాట్లాడతారు. హక్కుల అభిమానులు హాజరు కావాలని అచ్యుత్ కుమార్ కోరారు. పాల్గొన్నవారికి భోజన సదుపాయం ఉంటుంది.







