జమ్మికుంట: మంగళవారం, 11 నవంబర్, 2025 న న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
నూతన కమిటీ అధ్యక్షుడిగా పాస్టర్ జాన్, ఉపాధ్యక్షుడిగా డేవిడ్ పాస్టర్ ఎన్నికయ్యారు. పాస్టర్ జ్యోతి బాబు జనరల్ సెక్రటరీగా, పాస్టర్ సువార్త రాజు జాయింట్ సెక్రటరీగా, పాస్టర్ టైటస్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
పాస్టర్ అశోక్ గౌరవ అధ్యక్షులుగా, పాస్టర్ ప్రసాద్ ముఖ్య సలహాదారులుగా వ్యవహరించనున్నారు. కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ సైఫెన్, పాస్టర్ రాజేందర్ ఎన్నికయ్యారు.







