జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, దుర్గ కాలనీల అంగన్వాడీ కేంద్రాలను హుజురాబాద్ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ఈరోజు పర్యవేక్షించారు.
పిల్లలకు, గర్భిణీలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారంపై ఆరా తీశారు. కిరాయి భవనంలో కేంద్రం నడుపుతున్నామని, పక్కా అంగన్వాడీ సెంటర్ ఇప్పించాలని టీచర్ శారదా మేడం కోరారు. ఈ సమస్యను మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ప్రణవ్ బాబు దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే శాశ్వత భవనం కోసం కృషి చేస్తానని శ్రీపతి నరేష్ హామీ ఇచ్చారు.







