తేదీ 15-10-2025
జమ్మికుంట:
జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ నేతృత్వంలో పోలీసులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు.
వివరాల్లోకి వెళితే, జమ్మికుంట గ్రామానికి చెందిన లకిడి వీణ రాణి (భర్త విజయ్) తన వివో మొబైల్ ఫోన్‌ను జమ్మికుంటలో పోగొట్టుకున్నారు. ఆమె వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ కేసును స్వీకరించారు.
ఐఎంఈఐ (IMEI) నంబర్ ఆధారంగా సి.ఇ.ఐ.ఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోలీసులు గాలింపు చేపట్టారు. పోగొట్టుకున్న మొబైల్‌ను గుర్తించి, దానిని స్వాధీనం చేసుకుని బాధితురాలైన వీణ రాణికి అప్పగించారు.
ఈ సందర్భంగా టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ, ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌లో ఆ వివరాలను అప్‌లోడ్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. దీని ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు.







