జమ్మికుంట, నవంబర్ 22: కార్మిక హక్కులకు భంగం కలిగించే నాలుగు లేబర్ కోడ్ ల అమలు నోటిఫికేషన్ ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. శనివారం జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే కేంద్రం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల అనంతరం కార్మికులపై భారం మోపుతున్నారని విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.







