జమ్మికుంట, అక్టోబర్ 18 (జమ్మికుంటలోకల్.కామ్): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, బీసీలను మోసం చేస్తోందని సీపీఎం మండల కార్యదర్శి శీలం అశోక్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించకపోవడం సిగ్గుచేటని అన్నారు.
42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మోత్కులగూడెం చౌరస్తా నుండి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శీలం అశోక్ మాట్లాడుతూ, కేంద్రం బిల్లును ఆమోదించకుండానే బీసీల పట్ల ముసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు.రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోవడం వలన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ఆయన కేంద్ర బీజేపీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌ను ఆమోదించకుండా కాలయాపన చేయడం వల్లే జీవో నెంబర్ 9 అమలు నిలబడలేదని, దీనికి పూర్తి బాధ్యత బీజేపీ వహించాలని అన్నారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందకపోవడం వలన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ఆయన కేంద్ర బీజేపీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. గవర్నర్‌కు పంపిన ఆర్డినెన్స్‌ను ఆమోదించకుండా కాలయాపన చేయడం వల్లే జీవో నెంబర్ 9 అమలు నిలబడలేదని, దీనికి పూర్తి బాధ్యత బీజేపీ వహించాలని అన్నారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లును ఆమోదింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







