మంగళవారం ఉచిత ఓ.పి. సేవలు – ఆదిత్య ఆసుపత్రి, జమ్మికుంటలో గర్భిణీ, సాధారణ మహిళల కోసం ప్రత్యేక అవకాశం

జమ్మికుంట: ఆదిత్య ఆసుపత్రి మహిళలకు శుభవార్త తెలిపింది. ఇకపై ప్రతి మంగళవారం ఆసుపత్రిలో ఉచిత ఓ.పి. (ఔట్‌ పేషెంట్) సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
ఈ సదావకాశాన్ని గర్భిణీ మహిళలు మరియు సాధారణ మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చని ఆదిత్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.
మంగళవారం రోజున ఆసుపత్రికి వచ్చే మహిళలు ఎటువంటి ఫీజు లేకుండా వైద్యుల సలహాలు, సూచనలు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఉచిత ఓ.పి. సేవలను వినియోగించుకొని మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం పొందాలని వారు కోరారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact