October 16, 2025
జమ్మికుంట: పట్టణంలోని 22వ వార్డు అంబేడ్కర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుల్లి ప్రతాప్ ఆధ్వర్యంలో మల్లయ్య జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ప్రతాప్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మనసున్న పొనగంటి మల్లయ్య నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మల్లయ్యను శాలువాతో సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యూత్ సభ్యులు ఇల్లందుల శ్రీనివాస్, శశి కుమార్, రవిబాబు, రాజు, సన్నీ, కిషోర్, ఉదయ్, రఫీ, శ్రీకాంత్, మధు, జగన్, షఫీ, విక్కి, గుల్లి ప్రభాకర్, దామోదర్, ముత్తు, అభిరామ్, ధనుష్, విజయ్, ఆదిత్య, కబీర్ తదితరులు పాల్గొన్నారు.







