రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి

జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, గత రబీ సన్నధాన్యం బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact