జమ్మికుంట: మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ, ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు సాయం చేశారన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఆమెకు ‘ఉక్కు మహిళ’ అనే బిరుదును ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమె పేరుతో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోంది. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.







