తెలంగాణా గవర్నమెంట్ డాక్టర్స్ ఆసోషియేషన్ (TGGDA) రాష్ట్ర కార్యదర్శిగా డా.రవి ప్రవీణ్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక నిన్న ఆదివారం (తేదీ 09.08.2020) రోజు హైదరాబాద్ లో జరిగింది.నూతన కార్యవర్గంలో రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా నుండి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి కి చోటు దక్కింది.img 20200810 wa00058899442269075781124నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి ప్రస్తుత కరోనా సమయంలో డాక్టర్స్ మరియు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన డా.రవి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని విజయ వంతంగా అమలు చేయడానికి కృషి చేస్తామని తెలియ జేశారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact