జమ్మికుంటలో దొంత రమేష్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన వేడుకలను మంగళవారం జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దేశిని కోటి మాట్లాడుతూ, యువ నాయకుడైన దొంత రమేష్ ఎంతో మంది పేదలకు సహాయం చేశారని, రానున్న రోజుల్లో ఆయనకు మంచి ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, ఎలగందుల సరూప శ్రీహరి, పిట్టల శ్వేత రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పంజాల అజయ్, పాతకాల అనిల్, రామచంద్రం, మాటే టి రాజు, సందీప్, మహేష్, ప్రణయ్, పాతకాల రమేష్, రాచమల్ల మధుకర్, గురుకుంట్ల శ్రీకాంత్, అభిషేక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact