జమ్మికుంట: తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టో హామీల ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సదయ్య ధీమా వ్యక్తం చేశారు.







