ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మాజీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వర్కుటి మదన్ రావు అనారోగ్యంతో సెప్టెంబర్ 20న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందారు. ఆర్మీ, రైల్వే శాఖల్లో సేవలందించిన ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మదన్ రావు మృతికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మోలుగూరి సదయ్య సంతాపం తెలిపారు. మదన్ రావు భౌతికదేహంపై కాంగ్రెస్ కండువా వేసి నివాళులర్పించారు. పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
జమ్మికుంట: తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టో హామీల ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సదయ్య ధీమా వ్యక్తం చేశారు.