జమ్మికుంట: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతుల రద్దుతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంట CITU మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.
CITU జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల కోసం జమ్మికుంట పట్టణంలో ప్రత్యేక అడ్డా స్థలం కేటాయించాలని, అక్కడ మంచినీరు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సంక్షేమ బోర్డు నిధులను ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వడాన్ని ఆపాలని, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు. మీ సేవలో అధిక సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, కార్మిక శాఖ కార్యాలయంలో బ్రోకర్ల వ్యవస్థను రూపుమాపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెరా రాజకుమారి, పూదరి స్వామి గౌడ్, నరాల స్వరూప తదితర నాయకులు పాల్గొన్నారు.








