స్థానిక జమ్మికుంట గాంధీ చౌరస్తాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి, టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేసి, ప్రస్తుతం 6 గ్యారంటీలను, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరమనేని పరిసరామారావు, పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయిని రవి పాల్గొన్నారు.







