బీహార్‌లో బీజేపీ గెలుపుతో జమ్మికుంటలో సంబరాలు

జమ్మికుంట: బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి 243 స్థానాలకు గాను సుమారు 206 సీట్లలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం కొలకాని రాజు మాట్లాడుతూ, దొంగ ఓట్లంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రచారాన్ని బీహార్ ప్రజలు ఓటుతో తిరస్కరించడం చెంపపెట్టు అని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ ప్రజాస్వామ్యాన్ని, తీర్పును గౌరవించాలని హితవు పలికారు. మోదీ పాలనలో దేశ భద్రత, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. రానున్న తెలంగాణ స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆకుల రాజేందర్, జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact