జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం యూసఫ్‌గూడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన తన అనుచరులతో కలిసి హల్‌చల్ సృష్టించారు.
పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ఆయన సిబ్బందిని తోసేసి కేంద్రంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని ఆరోపణ. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కౌశిక్‌రెడ్డిపై అక్రమ ప్రవేశం (ట్రెస్పాస్), పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆయన తీరు ఉద్రిక్తతలకు దారితీసిందని అధికారులు తెలిపారు.







