జమ్మికుంట: హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన న్యాయవాది నుతాల శ్రీనివాస్‌ను బీజేపీ నాయకులు జమ్మికుంటలోని ఆయన స్వగృహంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడారు. న్యాయ వృత్తిలో పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలబడే మంచి పేరు శ్రీనివాస్‌కు ఉందని కొనియాడారు.
చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో పనిచేసి, బీజేపీ పటిష్టతకు కూడా కృషి చేశారని నాయకులు గుర్తు చేశారు. 2021 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు మద్దతుగా నిలబడి, అక్రమ కేసులకు భయపడకుండా పార్టీ గెలుపుకు కృషి చేశారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో జమ్మికుంటలో నూతన కోర్టు ఆవశ్యకత నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కోరే రవీందర్, కొమ్ము అశోక్, మేక సుధాకర్ రెడ్డి, గండికోట సమ్మయ్య, తూడి రవిచందర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.







