వీణవంక మాజీ సింగిల్ విండో చైర్మన్ పెద్ది మల్లారెడ్డి కుమార్తె డా. సుప్రియ – డా. ఆదిత్య కిషోర్ వివాహం బుధవారం కరీంనగర్‌లోని కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో జరిగింది. అలాగే, జమ్మికుంట మడిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు పెరవేన రమేశ్ కుమారుడు అఖిల్ – దివ్యల వివాహం జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్‌లో జరిగింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఈ నూతన వధూవరులను ఆశీర్వదించారు.







