
తేదీ 30-9-2025 మంగళవారం
జమ్మికుంట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క 84వ సాధారణ సర్వసభ సమావేశము అధ్యక్షులు పొనగంటి సంపత్ అధ్యక్షతన ఉ. 11 గం.లకు నిర్వహించారు. అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ మన సంఘం ఈరోజు అభివృద్ధి బాటలో ఉండటానికి కారణం సంఘ సభ్యులు మరియు రైతులు తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించడం వల్లే అని, ప్రభుత్వం ఇస్తున్న 3% వడ్డీ రాయితీ రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు.
సమావేశానికి సంఘం ఉపాధ్యక్షులు మామిడి తిరుపతి రెడ్డి, మురుపాయల తిరుపతిరావు, పోల్సాని లింగా రావు, రాజశేఖర్ రావు, బిట్ల రమాదేవి, పోతుల సమ్మయ్య, కుమార్ , తక్కలపల్లి రాధిక, ఎజ్జ తిరుపతి, పింగిలి శ్రీలత, మర్రిపల్లి రాజయ్య, సంఘ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.







