తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణంలోని స్థానిక ప్రకాశం విజ్ఞాన కేంద్రం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు తేదీ 16 ,17, 18 నిర్వహి స్తున్నారు.  రెండోరోజు భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శ మిల్కూరి వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది.

ఇందులో ముఖ్య అతిథులు జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ శాఖ పరిశోధన యూనివర్సిటీ ప్రొఫెసర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు తీర్చాలని రైతు పంటలకు మద్దతు ధర కల్పించాలని కౌలు రైతులకు రైతుబంధు కల్పించాలని డిమాండ్ చేశారు లేనియెడల పెద్ద మొత్తంలో రైతుల తరపున ఉద్యమం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల రైతు సంఘం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact