జమ్మికుంటలో బోగస్ ఓట్ల ఏరివేతకు యూత్ కాంగ్రెస్ డిమాండ్

జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు ఆధ్వర్యంలో తహసిల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
కొందరు నాయకులు మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తులకు ఇళ్లతో సంబంధం లేకుండా నెంబర్లు కేటాయించి, దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ఓటరు జాబితాను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డే సంధ్యా నవీన్, పంజాల అజయ్, ప్రశాంత్ సన్నీ, దేవునూరి వినయ్, ఆకినపల్లి శ్యామ్, బండి పవన్ తదితరులు పాల్గొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact