కరీంనగర్ జిల్లా (అక్టోబర్ 18, 2025): కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అభిప్రాయ సేకరణ
హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కరీంనగర్లో ఏఐసీసీ పరిశీలకులు మానే శ్రీనివాస్, పీసీసీ ప్రతినిధులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణను మర్యాదపూర్వకంగా కలిశారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఏఐసీసీ పరిశీలకులు, పీసీసీ ప్రతినిధులు కరీంనగర్‌కు విచ్చేసిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. జిల్లా కాంగ్రెస్ నాయకత్వం గురించి నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ తన అభిప్రాయాలను వారికి తెలియజేసినట్లు సమాచారం.







