తమ పనిమీద జమ్మికుంటలోని కాకతీయ డిజి స్కూల్ వద్ద వెళ్తున్న మాచనపల్లి గ్రామానికి చెందిన కనవేనా తిరుపతి (32), కనవేనా ప్రశాంత్ (27)లకు ఒక పుస్తెలతాడు కనిపించింది. వెంటనే వారు దానిని జమ్మికుంట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ రామకృష్ణ విచారించి, అది మల్యాలకు చెందిన నేరెళ్ల స్రవంతి (25)దిగా గుర్తించి ఆమెకు తిరిగి ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన తిరుపతి, ప్రశాంత్‌లను ఇన్స్పెక్టర్ అభినందించారు.







