జమ్మికుంట: తెలంగాణ సాహిత్య కిరణం అందెశ్రీ అస్తమయం
తెలంగాణ ప్రముఖ కవి, పద్మశ్రీ అందె శ్రీ ఆకస్మిక మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన రాసిన “జయ జయహే తెలంగాణ” గీతం కోట్లాది ప్రజల గొంతుకగా నిలిచింది. “మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు” లాంటి గేయాలు తెలంగాణ ఉద్యమంలో ప్రజలను జాగృతం చేయడంలో చిరస్మరణీయ పాత్ర పోషించాయి. గొప్ప కళాకారుడిని కోల్పోవడం విషాదకరం.
ఈ సందర్భంగా, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణ సాగర్ నేత తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందె శ్రీ ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు.







