జమ్మికుంట: బీసీల హక్కులు, రిజర్వేషన్లు ప్రజాస్వామిక హక్కు అనే నినాదంతో ఈనెల 19న (బుధవారం) ఇందిరా నగర్‌లోని దినేష్ కన్వెన్షన్ హాల్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో భారీ బీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సును రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల బీసీలు హాజరై విజయవంతం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శనిగరపు తిరుపతయ్య కోరారు.
సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అధికారంలో ఉన్న, రాబోయే అన్ని పార్టీలను డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పింగిలి రమేష్, పొనగంటి సంపత్, ఏ బూసి శ్రీనివాస్, కొలకాని కాని రాజులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవి, ప్రొఫెసర్ మురళీ మనోహర్ వంటి ప్రముఖులు సదస్సుకు హాజరుకానున్నారు.







