జమ్మికుంట: పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలను యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంఈఓ అధికారులకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసి, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపవద్దని అన్నారు. ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వ చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు మంచి విద్య, పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, కొందరి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అప్రతిష్టపాలు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్లపెల్లి నాగరాజు, సజ్జు, బండి పవన్, వినయ్, శ్యామ్, బిజిగిరి శ్రీకాంత్, అజయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.







