వావిలాల: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జమ్మికుంటలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ వరుణ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో 43 మంది వృద్ధులకు రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వరుణ మాట్లాడుతూ, వృద్ధులు శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ నడక, ధ్యానం, ఉదయపు ఎండలో గడపడం వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వ మందులనే వాడటం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని, ఈ మందులు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, మోహన్ రెడ్డి, అరుణ, ఏఎన్ఎంలు మంజుల, కవిత, రజిత, వాణి, రాధా తదితరులు పాల్గొన్నారు.







