ఎస్సీ వర్గీకరణ ఫలించింది: జమ్మికుంట అమ్మాయికి ఎంబీబీఎస్ సీటు

జమ్మికుంట, అక్టోబర్ 12, 2025:
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత దాని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. జమ్మికుంటకు చెందిన అంబాల ప్రభు – లత దంపతుల ప్రథమ పుత్రిక అంబాల అక్షిత, మెడికల్ కౌన్సిలింగ్‌లో వరంగల్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు.
ఈ సందర్భంగా, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు ఇంజమ్ వెంకటస్వామి, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొలుగురి సదయ్యలు అక్షితను శాలువాతో సన్మానించారు.
వారు మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ పోరాటం ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిందని అన్నారు. దీని ద్వారానే మాదిగ జాతి, ఉపకులాల విద్యార్థులకు ఇలాంటి ఉన్నత ఫలాలు అందుతున్నాయని, అక్షిత సీటు సాధించడం దీనికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact