ఇందిరానగర్: హుజురాబాద్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన దుబాసి సౌజన్య, సురేష్ దంపతులు తమ ఆనందాన్ని పంచుకుంటూ, సాయి ఆశ్రమానికి రూ. 10,000 విలువైన సౌండ్ బాక్స్ సిస్టమ్‌ను బహూకరించారు. సింగరేణి సంస్థలో సౌజన్యకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా, దుబాసి మహేందర్, స్వరూప సలహా మేరకు ఆశ్రమంలో సౌండ్ బాక్స్ అవసరం తెలుసుకొని దీనిని అందించినట్లు సౌజన్య తెలిపారు.
ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు మాట్లాడుతూ, దాతలకు, సహకరించిన మహేందర్, స్వరూపలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందిరానగర్ మాజీ సర్పంచ్ సిరిమల్లె రాజు, మేడద విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబాసి మహేందర్, స్వరూప, కోడి గూటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.







