జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో సైకో వీరంగం

తేదీ 22-12-2019

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో సైకో వీరంగం. గ్రామానికి చెందిన ఓ వివాహితను తన వెంట పంపించాలని డిమాండ్ చేస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్యాంకు ప్రాంతంలో కరెంటు లేకపోవడంతో చీకట్లు ఉన్నాయి. కిందికి దిగాలని పోలీసులు అతనికి నచ్చ చెబుతున్నారు. పెళ్లై భర్త ఉన్న మహిళను పెళ్లి చేసుకుంటానని, తన వెంట పంపించాలని సైకో డిమాండ్ చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడు మేరుగు శ్రీనివాస్ యాదవ్, హుజురాబాద్ మండలం ఇప్పల నర్సింగాపూర్ గా గుర్తించిన పోలీసులు.

psycho-at-dharmaram-jammikunta.jpg
psycho-at-dharmaram-jammikunta.jpg
aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact