ఈనాడు ‘ప్రతిభ పాటవ’ చిత్రలేఖన పోటీల్లో విద్యోదయ పాఠశాల విద్యార్థులకు బహుమతులు

16 అక్టోబర్ 2025
జమ్మికుంట: ఈనాడు పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రతిభ పాటవ’ చిత్రలేఖన పోటీల్లో జమ్మికుంటలోని విద్యోదయ పాఠశాల (VIDYODAYA SCHOOLS) విద్యార్థులు తమ ప్రతిభను చాటి బహుమతులు గెలుచుకున్నారు.
పిల్లలకు ఇష్టమైన పండుగల అంశంపై నిర్వహించిన ఈ చిత్రలేఖన పోటీల్లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో పలువురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందారు.
పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ యేభూషి ఆర్యన్ కౌశిక్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజేతలను కరస్పాండెంట్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

aditya hospital banner

Also read:

Listings News Offers Jobs Contact