హైదరాబాద్: మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను నూర్ భాషా (A, B, E) గ్రూపుల తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ యూసఫ్ శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. అఫ్జల్‌గంజ్‌లోని సెంట్రల్ లైబ్రరీ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి దృష్టికి, నూర్ భాషా కులస్తులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను యూసఫ్ తీసుకెళ్లారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ […]
జమ్మికుంట: తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుపై కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మేనిఫెస్టో హామీల ఫలాలను ప్రజలు అనుభవిస్తున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సదయ్య ధీమా వ్యక్తం చేశారు.
ఇల్లందకుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి.నాయకులు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం, పురోభివృద్ధిలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు, రచయిత మరియు రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగానే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నెహ్రూ ఆశయాల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ […]
జమ్మికుంట: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ, సౌండ్ బాక్సుల నడుమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పార్టీ పెద్దలందరికీ, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చూసే ప్రజలు నవీన్ యాదవ్‌ను గెలిపించారని, రానున్న స్థానిక […]
జమ్మికుంట: రైస్ మిల్ ఆపరేటర్లకు కనీస వేతనంగా రూ. 26,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సదుపాయాలను హమాలీ, వాచ్‌మెన్ వంటి అన్ని రకాల కార్మికులకు అమలు చేయాలని ఆయన కోరారు.యజమాన్యాలు కనీస వేతనంపై కాకుండా ఇష్టానుసారం పీఎఫ్ చెల్లిస్తున్నాయని, పాత కార్మికులకు భద్రత లేకుండా చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. బీహార్ వలస కార్మికుల చట్టాన్ని కఠినంగా అమలు చేసి, వారి శ్రమ దోపిడీని […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం యూసఫ్‌గూడలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన తన అనుచరులతో కలిసి హల్‌చల్ సృష్టించారు.పోలీసులు అడ్డుకున్నప్పటికీ, ఆయన సిబ్బందిని తోసేసి కేంద్రంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని ఆరోపణ. ఈ ఘటనపై మధురానగర్ పోలీసులు కౌశిక్‌రెడ్డిపై అక్రమ ప్రవేశం (ట్రెస్పాస్), పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద […]
జమ్మికుంట: పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలను యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, ఎంఈఓ అధికారులకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసి, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి అలసత్వం చూపవద్దని అన్నారు. ఆహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వ చర్యలు తప్పవని […]
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన వేడుకలను మంగళవారం జమ్మికుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దేశిని కోటి మాట్లాడుతూ, యువ నాయకుడైన దొంత రమేష్ ఎంతో మంది పేదలకు సహాయం చేశారని, రానున్న రోజుల్లో ఆయనకు మంచి ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మాజీ […]
జమ్మికుంట: మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నవంబర్ 10, సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన 26 మంది విద్యార్థులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో నాయకుల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎమ్మార్వో, స్థానిక ఎంఈఓలతో కలిసి విద్యార్థుల సమస్యలను, మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన లోపాలను తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, […]
జమ్మికుంట: మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లలో అన్నదాతలను నిలువునా దోపిడీ చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆయన, మిల్లర్లు ప్రతి క్వింటాల్‌కు 5 నుండి 8 కిలోలు అదనంగా కాటా వేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లపై వెంటనే విజిలెన్స్ తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, ఐకేపీ సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, […]