Category: News

Feb 22
యువ న్యాయవాదికి అండగా ఆలయ ఫౌండేషన్: వీల్ చైర్ పంపిణీ

జమ్మికుంట: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక యువ న్యాయవాదికి ఆలయ ఫౌండేషన్ మానవత్వంతో అండగా నిలిచింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన యువ న్యాయవాది వీరవేన కుమార్ గత కొంతకాలంగా అనారోగ్య కారణాల వల్ల రెండు కాళ్లు పక్షవాతానికి గురై ఇంటికే పరిమితమయ్యారు.వృత్తి రీత్యా న్యాయవాది అయినప్పటికీ, శారీరక ఇబ్బందులు మరియు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న కుమార్, ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణ సాగర్ను సంప్రదించారు. ఈ విషయాన్ని ఫౌండేషన్ మార్గదర్శకులు, […]

Feb 22
జమ్మికుంటలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు

జమ్మికుంట: పట్టణంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి వేడుకలు యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా ఆధ్వర్యంలో పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అఖిలభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి తనదైన శైలిలో స్వాతంత్ర ఉద్యమాన్ని […]

Feb 22
తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా సిరిమల్లె జయేందర్

జమ్మికుంట: తెలంగాణ అయ్యప్ప సేవర్థి ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షులు సిరిమల్లె జయేందర్ గురు స్వామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు వాకాటి భాస్కరరావు  జయేందర్ సేవలను గుర్తించి ఉపాధ్యక్షులుగా నియమించినారు 2026-2028 రెండు సంవత్సరాల కాలానికి గాను రెండవసారి ఉపాధ్యక్ష పదవి వరించడం పట్ల జమ్మికుంట అయ్యప్ప స్వాములు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం అయ్యప్ప దేవాలయంలో స్వామి ఎదుట ప్రమాణ స్వీకారం […]

Jan 27
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 11న పోలింగ్

హైదరాబాద్ – రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ​ముఖ్యమైన తేదీలు ​ఓటర్ల వివరాలు ​ఈ ఎన్నికల్లో మొత్తంగా 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Dec 30
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్: నేటి పత్తి ధరలు ఇవే!

జమ్మికుంట: వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 244 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. మొత్తం 33 వాహనాల్లో రైతులు సరుకును మార్కెట్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పత్తి క్వింటాలుకు గరిష్ట ధర రూ. 7,400, మోడల్ ధర రూ. 7,250, కనిష్ట ధర రూ. 7,000 పలికింది.కాగా, కాటన్ బ్యాగుల విభాగంలో ఎలాంటి సరుకు రాక పోవడంతో అమ్మకాలు జరగలేదని మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తెచ్చేటప్పుడు మార్కెట్ నిబంధనలు […]

Dec 30
జమ్మికుంటలో బోగస్ ఓట్ల ఏరివేతకు యూత్ కాంగ్రెస్ డిమాండ్

జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నమోదైన బోగస్ ఓట్లను వెంటనే తొలగించాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి సజ్జు ఆధ్వర్యంలో తహసిల్దార్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆయాజ్‌లను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.కొందరు నాయకులు మున్సిపాలిటీతో సంబంధం లేని వ్యక్తులకు ఇళ్లతో సంబంధం లేకుండా నెంబర్లు కేటాయించి, దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు తక్షణమే సమగ్ర […]

Dec 19
డిసెంబర్ 27న కరీంనగర్‌లో శాతవాహన యూనివర్సిటీలో మెగా జాబ్ ఫెయిర్

కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సహకారంతో మెగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించనుంది. ఈ ఉద్యోగ మేళా డిసెంబర్ 27, 2025న ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా జాబ్ ఫెయిర్ శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్ రోడ్, చింతకుంట, కరీంనగర్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో 50కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, వీటి ద్వారా 5,000కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉద్యోగ […]

Dec 03
వీణవంక కాంగ్రెస్‌కు బిగ్ షాక్: బీఆర్ఎస్‌లో చేరిన మహిపాల్ రెడ్డి

వీణవంక: స్థానిక సంస్థల ఎన్నికల వేళ హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీణవంక మండలం కిష్ణంపేటకు చెందిన సీనియర్ నాయకుడు సిద్ధపల్లి మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని మహిపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన […]

Nov 25
మోగిన పంచాయతీ నగారా.. మూడు విడతల్లో ఎన్నికల సందడి షురూ!

నవంబర్ 25, 2025: తెలంగాణలో స్థానిక సమరానికి తెరలేచింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అధికారికంగా ప్రకటించారు.ఎన్నికల షెడ్యూల్ వివరాలువిడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల పోలింగ్ మరియు నామినేషన్ల ప్రక్రియ ఈ కింది విధంగా ఉండనుంది: మొదటి విడత: ఈ విడత నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 నుంచి ప్రారంభం కానుండగా, డిసెంబర్ […]

Nov 24
జాబ్ అలర్ట్: జమ్మికుంట ఎయిర్‌టెల్‌లో సిమ్ సేల్స్ ప్రమోటర్స్ కోసం జాబ్ మేళా

జమ్మికుంట: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్, తమ జమ్మికుంట ఆఫీస్ పరిధిలో సిమ్ సేల్స్ ప్రమోటర్స్ పోస్టుల భర్తీ కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం.ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు. స్త్రీ, పురుషులు ఎవరైనా అర్హులు. ముఖ్యంగా, ఉద్యోగ స్థానం అభ్యర్థులకు దగ్గరలోని ప్రాంతాల్లోనే లభిస్తుంది. * పోస్టులు: సిమ్ సేల్స్ ప్రమోటర్స్ * వయో పరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు * […]

Listings News Offers Jobs Contact