వావిలాల అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక సభ జరిగింది. హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి పాల్గొన్నారు. తల్లిదండ్రులకు చక్కెర, నూనె, ఉప్పు వాడకంపై, అలాగే పోషకాహారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబానికి రక్ష అని, కుటుంబంలో వారి పాత్ర ముఖ్యమని వక్తలు తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో జరిగే ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని వినియోగించుకుని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రత పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా పురుషులకు వంటల పోటీని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కుసుమ కుమారి, కార్యదర్శి రాము, అంగన్వాడీ టీచర్లు రేష్మ, గౌతమి, జ్యోతి, స్వర్ణలతతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు.







