ఇల్లందకుంట: హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు, ఇల్లందకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి.
నాయకులు మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్యం, పురోభివృద్ధిలో నెహ్రూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన గొప్ప నాయకుడు, రచయిత మరియు రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నంగానే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. నెహ్రూ ఆశయాల స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కనుమల్ల సంపత్, అన్నం ప్రవీణ్, పెద్ది శివకుమార్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.







