జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ విజయం: జమ్మికుంటలో కాంగ్రెస్ సంబరాలు!

జమ్మికుంట: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
టపాసులు కాల్చి, స్వీట్లు పంచుతూ, సౌండ్‌ బాక్సుల నడుమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పార్టీ పెద్దలందరికీ, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చూసే ప్రజలు నవీన్ యాదవ్‌ను గెలిపించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ నాయకులు పాల్గొన్నారు.

aditya hospital banner
Listings News Offers Jobs Contact