కరీంనగర్: వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (WJI) కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కరీంనగర్‌లోని ఓ బాంకెట్ హాల్‌లో జరిగిన WJI సర్వసభ్య సమావేశంలో ఈ నియామకాలు జరిగాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన బీఎంఎస్ (BMS) అనుబంధ సంఘంగా WJI గుర్తింపు పొందింది.
ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు నర్సిని కేదారి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
నూతనంగా ఎన్నికైన నర్సిని కేదారి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని, వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు.
కేదారి నియామకం పట్ల జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు.
తన నియామకానికి సహకరించిన WJI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి శివ నాదుని ప్రమోద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. సత్యనారాయణ, జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంబాల ప్రభాకర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







