హైదరాబాద్: మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను నూర్ భాషా (A, B, E) గ్రూపుల తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు జమ్మికుంటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ యూసఫ్ శుక్రవారం హైదరాబాద్‌లో కలిశారు. అఫ్జల్‌గంజ్‌లోని సెంట్రల్ లైబ్రరీ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి దృష్టికి, నూర్ భాషా కులస్తులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను యూసఫ్ తీసుకెళ్లారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారని యూసఫ్ తెలిపారు.







